పోలీసులను ఎంతమందినైనా పిలవండి.. వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఎంతమంది పోలీసులను మోహరించినా, నాయకులను అరెస్టు చేసినా తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. అక్టోబర్ 10న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తదితరులపై రాహుల్ విమర్శలు చేశారు. వారిలో పిరికితనం ప్రధాన లక్షణమని ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడటం, ప్రజల గొంతును పరిరక్షించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. యువత...