పొలానికి వెళ్లే దారికి అడ్డంగా చెత్త కుప్పలు వేసిన పట్టించుకోని అధికారులు

* డంపింగ్ యార్డ్ ఉండగా దారిపై చెత్త వేసిన వైనం *అనంతగిరి*అక్టోబర్ 10, (ఆర్యాద్వి): మండల పరిధిలోని వసంతాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న ర్యాంపును గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఆ దారిలో నడపగా రాంపు ధ్వంసం అయింది. ఇదేంటని ప్రశ్నించినందుకు గ్రామానికి చెందిన రైతు పొలానికి వెల్లే ఆ దారికి అడ్డంగా చెత్త కుప్పలు వేయించారని ఆరోపణలు వస్తున్నాయి.రైతులు తమ పంటలను తీసుకెళ్లేందుకు, వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఈ దారే ప్రధాన మార్గం కాగా, ఇప్పుడు చెత్త, బురదతో మూసుకుపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు....