రూ. 70 కోట్లతో పోలేపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు…

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలేపల్లి లో రూ. 4.65 కోట్లతో బిటి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఖమ్మం, అక్టోబర్ -10 ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రూ. 4.65 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రెండు నూతన బిటి రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.  ఇందులో రూ. 2.42 కోట్ల అంచనా వ్యయంతో పోలేపల్లి నుండి దానవాయిగూడెం (వయా మున్నేరు) వరకు, రూ. 2.20 కోట్ల అంచనా...