ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమన సంరక్షణ.. యువతలో మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం

- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి రామారావు. ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్ 10 : ప్రపంచ హాస్పిస్ మరియు ఉపశమన సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) (జి జి హెచ్) లోని పాలియేటివ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామారావు, డి ఎం హెచ్ ఓ., మాట్లాడుతూ, తీవ్రమైన మరియు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు శారీరక నొప్పి నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు, మానసిక ధైర్యాన్ని అందించడంలో...