బతుకమ్మ పండుగకు నీటి కరువు..
చేతులెత్తేసిన కోదాడ మున్సిపాలిటీ! పండుగ వేళ నీటి కోసం మహిళల ఇబ్బందులు.. ఏర్పాట్లు చేయడంలో అధికారుల నిర్లక్ష్యమా? కోదాడ, అక్టోబర్ 10 (ఆర్యాద్వి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు కోదాడలో నీటి కొరత సమస్య ఎదురవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు అవసరమైన నీటి ఏర్పాట్లపై మున్సిపాలిటీ అధికారులు దృష్టి సారించాల్సి ఉండగా, సమస్యకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే మహిళలకు నీటి వసతులు సరిగా లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. పండుగ సందర్భంగా నిమజ్జన ప్రాంతాల్లో నీటి లభ్యత, పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాలు...