పూలవనంలో చిగురించిన ఆశల బతుకమ్మ
--- ఖమ్మంలో తలసేమియా చిన్నారుల హృదయాలను హత్తుకునే వేడుకలు! --- రక్తదాతలే మా ప్రాణదాతలు.. బంగారు బతుకునివ్వమ్మా గౌరమ్మ! ఖమ్మం, అక్టోబర్ 11 : "బతుకమ్మా.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకు ఇవ్వమ్మా.. ఉయ్యాలో!" ఆ పసి గొంతుకల నుంచి వెలువడిన ఈ ఆర్తనాదం, ఆనంద కేకలు ఆ ప్రాంగణాన్ని ఒక దివ్యమైన పూల వనంగా మార్చేశాయి. రోజూ మందు బిళ్లలు, సూదిమందుల నడుమ పోరాడే ఆ చిన్నారి ప్రాణాలు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకైన బతుకమ్మ పండుగ వేళ ఒక్కసారిగా ఉత్సాహంతో ఉప్పొంగాయి. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వైరా రోడ్డులోని రితన్య ఆసుపత్రి ప్రాంగణం ఆదివారం నాడు సరికొత్త శోభను సంతరించుకుంది....