ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 11: హైదరాబాదులో గిరిజన సంఘ రాష్ట్ర మహాసభలు ఎం ధర్మ నాయక్, భూక్యా వీరభద్రం, ఎం బాలు నాయక్,గుగులోత్ భీమా సాహెబ్ ,ఎర్ర నాయక్,అచ్చాలి బాయి అధ్యక్షతన జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టి మాట్లాడారు.వేదికపై వాంకుడోత్ వీరన్న, అశోక్ తదితరులు ఉన్నారు. -కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడాలి తీర్మానాన్ని ఆమోదించారు. -కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలుకు కార్యాచరణ ప్రకటించాలని లేకపోతే రాష్ట్ర వ్యాపిత ఐక్య ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. - పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని,...