అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి ఖమ్మం/తిరుమలాయపాలెం, అక్టోబర్ -11 రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి తెట్టెలపాడు గ్రామంలో తెట్టెలపాడు నుండి బీరోలు ఆర్ అండ్ బి రోడ్డు వరకు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంఖుస్థాపన, సుబ్లేడ్ గ్రామంలో...