సర్పంచ్ చొరవతో గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు

అక్టోబర్ 12, అనంతగిరి (ఆర్యాద్వి):మండల పరిధిలోని పాలవరం గ్రామంలో రాత్రి వేళల్లో ప్రజల సౌకర్యం మరియు భద్రత కోసం సర్పంచ్ మట్టపల్లి నరేష్ చొరవతో వీధి దీపాలను సోమవారం ఏర్పాటు చేశారు. అంధకారంలో ఉన్న ప్రధాన రహదారులు, కాలనీలు, పాఠశాల పరిసర ప్రాంతాల్లో కొత్తగా దీపాలు అమర్చడంతో గ్రామస్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ముఖ్య వీధుల్లో ఎల్ ఈ డి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దీపాలు అమర్చారు. పాతగా మారిన దీపాలను మార్చడం, దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేయించడం కూడా జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,... “గ్రామంలో రాత్రి వేళల్లో మహిళలు, విద్యార్థులు, వృద్ధులు సురక్షితంగా తిరగాలని ఈ ఏర్పాటు చేశాం...