కూచిపూడి దేవాలయాల సింహద్వారానికి శంకుస్థాపన...

కోదాడ, అక్టోబర్ 12 (ఆర్యాద్వి): కూచిపూడి గ్రామంలోని అంతరగంగా వాగు పక్కన శెట్టి వారి వంశస్థుల స్థలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న దేవాలయాల ప్రాంగణంలో సింహద్వారానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు కందికొండ సాయిబాబు మాట్లాడుతూ లక్షల విలువైన భూమిని దేవాలయాల నిర్మాణానికి విరాళముగా ఇచ్చి ఆలయ నిర్మాణానికి పునాదులు వేసిన శెట్టి వారి వంశస్థులకు ధన్యవాదములు తెలియజేస్తూ గ్రామ పెద్దలు,ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణం జరుగుతుందని వారి అందరి సహకారంతో శెట్టి వారి దైవభూమి నందు భక్తాంజనేయ స్వామి, సీతా రామాంజనేయ స్వామి ఆలయం, శబరిగిరి అయ్యప్ప మందిరం, లక్ష్మీ నరసింహ స్వామి, షిర్డీ సాయి మందిరాలు...