సోలార్ విద్యుత్ రాయితీలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
పీఎం సూర్య ఘర్ సేవ సేతు అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. నరసన్నపేట సోలార్ విద్యుత్ రాయితీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సేవా సేతు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న రాయితీతో కూడిన రూఫ్ టాప్ సోలార్ విద్యుత్తు పవర్ ప్లాంట్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు సోలార్ ప్యానల్ ఏర్పాటుపై భారీగా రాయితీలు (సబ్సిడీలు) అందిస్తున్నాయనితెలిపారు.గృహవినియోగదారులు, రైతులు, వ్యాపారవేత్తలు, తమ భవనాలు పొలాల్లో సోలార్...