సింహాల మధ్య సీతక్క.. దక్షిణాఫ్రికా సఫారీ వీడియోతో నెట్టింట సందడి!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి సీతక్క దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సఫారీలో భాగంగా రెండు సింహాల వెనుక ఆమె ధైర్యంగా నడుస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియోను సీతక్క తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో పలువురు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. సింహాల మధ్య ఆత్మవిశ్వాసంతో.. వీడియోలో సీతక్క చేతిలో కర్ర పట్టుకుని సింహాల వెనుక నడుస్తూ కనిపించారు. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన సీతక్కకు అడవులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పర్యటనలో బతుకమ్మ వేడుకలు దక్షిణాఫ్రికాలోని...