గ్రామ ప్రజలకు తెలియకుండా గ్రామసభ.. వెంకట్రమాపురంలో వివాదం....

అనంతగిరి అక్టోబర్ 13 (ఆర్యాద్వి): మండల పరిధిలోని వెంకట్రమాపురం గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించిన విషయం గ్రామ ప్రజలకు తెలియకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాటింపు వేయడం గానీ, మైక్ ద్వారా ప్రకటించడం గానీ లేకుండా గ్రామసభ నిర్వహించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామసభలో గ్రామ పంచాయతీ ఓటర్లందరూ సభ్యులే పాల్గొనే వేదికగా ఉండాల్సి ఉంది. స్థానికుల ఆరోపణలు గ్రామ పంచాయతీ నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ నిర్వహించడం జరిగిందని స్థానికులు తెలిపారు. సభ జరిగిన విషయం గ్రామంలో చాలామందికి తెలియకపోవడంతో ప్రజలు పాల్గొనే అవకాశం దక్కలేదని, ఇది గ్రామసభ ముఖ్యోద్దేశానికే విరుద్ధమని వారు...