మైనర్ మిస్సింగ్ కేసులను అత్యంత ప్రాధాన్యతతో విచారించాలి

సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా వ్యాప్తంగా విజబుల్ పోలిసింగ్.. నిరంతరం వాహనాల తనిఖీలతో నేరాలు కట్టడి *నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్* ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 13: మైనర్ బాలబాలికలు కనిపించకుండా పోయిన కేసులను పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, ప్రతి కేసులో తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..మైనర్ మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కేసు తీవ్రతను గుర్తించి, ఆలస్యం చేయకుండా...