ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..,

ఖమ్మం నగరం: అక్టోబర్, 13 : ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఖమ్మం నగరపాల సంస్థ ప్రాంగణంలో మంగళవారం ఉత్సాహంగా మరియు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు . ఖమ్మం నగరపాలక సంస్థ ఆవరణమంతా పూలతో అలంకరించి , కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను తయారుచేసి వాటి చుట్టూ తిరుగుతూ, బతుకమ్మ పాటలు పాడారు .ఆవరణమంతా పండుగ శోభను సంతరించుకుంది ఈ బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఈ సంస్కృతి , సంప్రదాయాలను పెద్దల నుంచి నేర్చుకోవడానికి మంచి అవకాశం కల్పించింది . ఈ బతుకమ్మ పండుగ...