జనసేనలోకి వంగవీటి రాధా.. విజయవాడ మేయర్ పీఠంపై ఉత్కంఠ!
విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అక్టోబర్ 14న పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మేయర్ రేసులో రాధా పేరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ జనరల్ కేటగిరీగా ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఆయన సతీమణి పుష్పవల్లి పేరు కూడా ఈ రేసులో వినిపించింది. అయితే, మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి...