అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాలు: పోలీస్ కమిషనర్
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్: 14: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు దేశ శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల విధులు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసుల ప్రతిభ, త్యాగాలను ప్రజలకు వివరించనున్నారు. వ్యాసరచన పోటీలు విద్యార్థులకు(12వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం )...