వైభవ్‌కు వరుసగా అవకాశాలివ్వాలి.. టీమ్ మేనేజ్మెంట్పై శ్రీకాంత్ అసహనం!
ఆర్యాద్వి న్యూస్ | స్పోర్ట్స్ భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లను పదేపదే మార్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్మెంట్కు సూచించారు. జింబాబ్వేలో అదరగొట్టిన వైభవ్ జింబాబ్వే పర్యటనలో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు టీ20 మ్యాచ్‌ల్లో వరుసగా 50, 20, 81 పరుగులు సాధించాడు. అయినప్పటికీ వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో అతడికి తుది జట్టులో స్థానం దక్కకపోవడంపై చర్చ మొదలైంది. ప్రతిభ చూపిన యువ...