జనసేనలోకి వంగవీటి రాధా.. మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా?

పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరిక.. విజయవాడలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ ఆర్యాద్వి న్యూస్‌ | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. బుధవారం (అక్టోబర్‌ 14) అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా రాధాకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మేయర్‌ రేసులో రాధా పేరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ మేయర్‌ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర...