అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. పాక్ కెప్టెన్ ఫర్హాన్ ప్రపంచ రికార్డు!
ఆర్యాద్వి న్యూస్ | స్పోర్ట్స్ పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొత్తం 238 పరుగులు చేసి, ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నెలకొల్పిన 229 పరుగుల రికార్డును అధిగమించాడు. ఐసీసీ అక్టోబర్ 14న ఈ విషయాన్ని వెల్లడించింది. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు శ్రీలంకతో జరిగిన సిరీస్లో ఫర్హాన్ వరుసగా 89, 73, 76 పరుగులు సాధించాడు. చివరి టీ20లో 47 బంతుల్లో 76 పరుగులు చేసి తన జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక...