తీరొక్క పూలతో అలంకరించి ఆరాధించే పండుగ బతుకమ్మ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఉత్సాహభరితంగా కలెక్టరేట్ లో అట్ల బతుకమ్మ వేడుకలు కలెక్టరేట్ లో వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలలో పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్ -14: తీరొక్క పూలతో అలంకరించి పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ మన బతుకమ్మ అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఐదవ రోజు అట్ల బతుకమ్మ సందర్భంగా కలెక్టరేట్ లోని వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ బతుకమ్మ వేడుకలలో కలెక్టరేట్లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ...