కోట మైసమ్మ జాతరలో మత విద్వేష ప్రచారం తగదు
మత సంస్ధల బ్యానర్లు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి జాతరలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : సీపీఎం డిమాండ్ కారేపల్లి, అక్టోబర్ 14: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో దసరా సందర్భంగా జరిగే కోట మైసమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అలయ ప్రాంగణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే బ్యానర్లను ఏర్పాటు చేయటాన్ని సీపీఐ(ఎం) ఆక్షేపించింది. తక్షణమే తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఉసిరికాయలపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా వైభవంగా జరిగే కోట మైసమ్మ జాతరకు కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. అయితే, జాతరలో హలాల్ నిషేధమంటూ,...