ఎల్బీనగర్లో వైభవంగా అమ్మవారి పూజలు
* అన్నపూర్ణాదేవిగా దర్శనం.. 108 రకాల నైవేద్యాల సమర్పణ * ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 14: నగరంలోని 8వ డివిజన్ ఎల్బీనగర్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు అమ్మవారు భక్తులకు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి భక్తిప్రపత్తులతో 108 రకాల పిండివంటలు, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో, బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు దేవభక్తిని కిషోర్ బాబు సహకారంతో బిఆర్ఎస్ నాయకుడు...