శని, ఆదివారాలే వీకెండ్ అనుకుంటున్నారా? ఈ దేశాల్లో సెలవుల లెక్కే వేరు!
సాధారణంగా మనకు వీకెండ్ అంటే శని, ఆదివారాలు గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వారాంతపు సెలవులు భిన్నంగా ఉంటాయి. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, ప్రభుత్వ విధానాల ఆధారంగా అక్కడ సెలవుల రోజులు నిర్ణయిస్తారు. సౌదీ అరేబియా, ఖతార్: ఈ దేశాల్లో సాధారణంగా శుక్ర, శనివారాలు వారాంతపు సెలవులు. ఆదివారం నుంచి గురువారం వరకు పని దినాలుగా ఉంటాయి. బంగ్లాదేశ్: సాధారణంగా శుక్రవారం, శనివారాలు వారాంతపు సెలవులుగా పాటిస్తారు. బ్రూనై: ఇక్కడ శుక్రవారం, ఆదివారం సెలవులు కాగా.. శనివారం పనిదినంగా ఉంటుంది. దీంతో మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడి వీకెండ్ విధానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. షార్జా: యూఏఈలోని షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి మూడు రోజుల...