రీ-సర్వేతో భూ సమస్యల శాశ్వత పరిష్కారం... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
భూ రీసర్వే సమయంలో రైతులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలి వైరా మండలం మేడిబండ రెవెన్యూ గ్రామంలో రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఖమ్మం, అక్టోబర్- 15: ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం వైరా మండలం మేడిబండ రెవెన్యూ గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారుని సమక్షంలో నిర్వహించి, రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని...