పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు: పోలీస్ కమిషనర్

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 15: విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీస్ సిబ్బంది కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కంటి చూపు సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స పొందడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఈ వైద్య...