కోదాడ నియోజకవర్గాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, అక్టోబర్ 15 (ఆర్యాద్వి): కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో రైతాంగం తీవ్ర కష్టాలు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే అవి కళ్లెదుటే ఎండిపోతుంటే గుండెలు ఆగిపోతున్నాయని...