-ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

-ఏఐటియుసి నాయకులు శింగు నర్సింహారావు ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 15: ఖమ్మం : ఎన్హెచ్ఎం ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష విడనాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు శింగు నర్సింహారావు డిమాండ్ చేశారు. -ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు పాలకులు తాత్సరం చేస్తున్నారని ప్రధానమైన రంగాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం లేదని ఆయన ఆరోపించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద గల ధర్నాచౌక్లో సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఏఐటియుసి -పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ వైద్య రంగంలో కాంట్రాక్ట్, -అవుటసోర్సింగ్ పేరుతో ఉద్యోగులను...