ఎంబీబీఎస్ సీటు సాధించిన మాజీ ఎంపీపీ కుమార్తె యాతాకుల వేరోనిక

నడిగూడెం మాజీ ఎంపీపీ కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు - శుభాకాంక్షలు వెల్లువ కోదాడ అక్టోబర్ 15( ఆర్యాద్వి): మండలానికి చెందిన మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు దంపతుల పెద్ద కుమార్తె యాతాకుల వేరోనిక ఎంబీబీఎస్ సీటు సాధించి మండల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో వేరోనిక ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఎంబీబీఎస్ సీటు సాధించడం ప్రతి విద్యార్థికి ఒక కల అని, తన కూతురు ఆ కలను సాకారం చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు జ్యోతి మధుబాబు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేరోనిక మాట్లాడుతూ... తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల...