గొడ్రియాల శివారులో 50 మామిడి చెట్ల నరికివేత!
👉అధికారుల అనుమతులు ఉన్నాయా? యంత్రాలతో చెట్ల తొలగింపుపై అనుమానాలు! 👉నరికివేతపై విచారణ జరిపించాలని స్థానికుల డిమాండ్ అనంతగిరి, అక్టోబర్ 16 (ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గొడ్రియాల గ్రామ శివారులో సుమారు 50 మామిడి చెట్లను నరికివేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇంత పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించడానికి అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. *అధికారులకు తెలిసే జరిగిందా?* గ్రామ శివారులో పెద్ద సంఖ్యలో మామిడి చెట్లు నరికివేతకు గురవుతున్నా సంబంధిత అధికారులు ముందస్తు సమాచారం తీసుకున్నారా? చెట్ల నరికివేతకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎన్ని చెట్లకు...