*ఎన్నారై రవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలారంలో పంచాయతీ సిబ్బందికి 15 లక్షల ప్రమాద బీమా

*వార్డు సభ్యులందరికీ త్వరలో బీమా: బెల్లంకొండ రవి* *అనంతగిరి అక్టోబర్ 17( ఆర్యాద్వి):* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామపంచాయతీ సిబ్బందికి వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అనంతగిరి మండలంలోని పాలారం గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రూ.15 లక్షల కవరేజ్‌తో కూడిన బీమాను శుక్రవారం పాలారం పోస్టాఫీసులో ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టల్ శాఖ ద్వారా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మట్టపల్లి నరేష్, గ్రామ కార్యదర్శి వెంకటేష్, ఎన్నారై రవి ఫౌండేషన్ చైర్మన్ బెల్లంకొండ...