అంతర్జాతీయ పేదల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పేదలకు నూతన వస్త్రాల పంపిణీ_

కోదాడ, అక్టోబర్ 17 (ఆర్యాద్వి): అంతర్జాతీయ పేదల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ నయా నగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో పేదలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యకమము కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి యేసయ్య ఆధ్వర్యంలో కొంతమంది నిరుపేదలకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా పేదలకు సహాయం చేయాలని, పేదలను ఆదుకోవడమే నిజమైన దైవ సేవ అని పేర్కొన్నారు. పేదల పట్ల ప్రేమ, సహాయం చూపడం ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులు...