Home

ఎంబీబీఎస్ సీటు సాధించిన మాజీ ఎంపీపీ కుమార్తె యాతాకుల వేరోనిక

నడిగూడెం మాజీ ఎంపీపీ కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు - శుభాకాంక్షలు వెల్లువ కోదాడ అక్టోబర్ 15( ఆర్యాద్వి): మండలానికి చెందిన మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు దంపతుల పెద్ద కుమార్తె యాతాకుల వేరోనిక ఎంబీబీఎస్ సీటు సాధించి మండల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో వేరోనిక ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఎంబీబీఎస్ సీటు సాధించడం ప్రతి విద్యార్థికి ఒక కల అని, తన కూతురు ఆ కలను సాకారం చేసుకోవడం...

-ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

-ఏఐటియుసి నాయకులు శింగు నర్సింహారావు ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 15: ఖమ్మం : ఎన్హెచ్ఎం ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష విడనాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు శింగు నర్సింహారావు డిమాండ్ చేశారు. -ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు పాలకులు తాత్సరం చేస్తున్నారని ప్రధానమైన రంగాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం లేదని ఆయన ఆరోపించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద గల ధర్నాచౌక్లో సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల...

కోదాడ నియోజకవర్గాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, అక్టోబర్ 15 (ఆర్యాద్వి): కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో రైతాంగం తీవ్ర కష్టాలు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం...

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు: పోలీస్ కమిషనర్

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 15: విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీస్ సిబ్బంది కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కంటి చూపు...

రీ-సర్వేతో భూ సమస్యల శాశ్వత పరిష్కారం... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

భూ రీసర్వే సమయంలో రైతులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలి వైరా మండలం మేడిబండ రెవెన్యూ గ్రామంలో రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఖమ్మం, అక్టోబర్- 15: ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం వైరా మండలం మేడిబండ రెవెన్యూ గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. రీ సర్వే మొత్తం...

కొత్త గోల్ తండా గ్రామంలో ఘనంగా దుర్గమ్మ తల్లి కుంకుమ పూజ

అనంతగిరి, అక్టోబర్ 15( ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో దుర్గమ్మ తల్లి కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గమ్మ తల్లికి కుంకుమ సమర్పించి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో, స్థానిక సర్పంచ్ బోడానంద,...

శని, ఆదివారాలే వీకెండ్‌ అనుకుంటున్నారా? ఈ దేశాల్లో సెలవుల లెక్కే వేరు!

సాధారణంగా మనకు వీకెండ్‌ అంటే శని, ఆదివారాలు గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వారాంతపు సెలవులు భిన్నంగా ఉంటాయి. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, ప్రభుత్వ విధానాల ఆధారంగా అక్కడ సెలవుల రోజులు నిర్ణయిస్తారు. సౌదీ అరేబియా, ఖతార్: ఈ దేశాల్లో సాధారణంగా శుక్ర, శనివారాలు వారాంతపు సెలవులు. ఆదివారం నుంచి గురువారం వరకు పని దినాలుగా ఉంటాయి. బంగ్లాదేశ్: సాధారణంగా శుక్రవారం, శనివారాలు వారాంతపు సెలవులుగా పాటిస్తారు. బ్రూనై: ఇక్కడ శుక్రవారం, ఆదివారం సెలవులు కాగా.. శనివారం పనిదినంగా ఉంటుంది. దీంతో మిగతా...

ఎల్బీనగర్‌లో వైభవంగా అమ్మవారి పూజలు

* అన్నపూర్ణాదేవిగా దర్శనం.. 108 రకాల నైవేద్యాల సమర్పణ * ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 14: నగరంలోని 8వ డివిజన్ ఎల్బీనగర్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు అమ్మవారు భక్తులకు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి భక్తిప్రపత్తులతో 108 రకాల పిండివంటలు, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్...

ఖమ్మం "కలెక్టరేట్ లో" శిశు సంక్షేమ శాఖ" పిడి ప్రమీల" ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 14: ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం శిశు సంక్షేమ శాఖ "పిడి ప్రమీల" ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణములు ఐదవరోజు అట్ల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవముగా జరుపుకున్నారు . ఐసిడిఎస్ అధికారులు అంగనవాడి టీచర్లు భారీగా తరలి రావడం తో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది . చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ ఉయ్యాల పాటలతో , చప్పట్లు ఆటలతో , కోలాటాలతో ఆడుకోవడం జరిగింది . అనంతరం ప్రసాద వితరణ...

కోట మైసమ్మ జాతరలో మత విద్వేష ప్రచారం తగదు

మత సంస్ధల బ్యానర్లు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి జాతరలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : సీపీఎం డిమాండ్ కారేపల్లి, అక్టోబర్ 14: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో దసరా సందర్భంగా జరిగే కోట మైసమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అలయ ప్రాంగణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే బ్యానర్లను ఏర్పాటు చేయటాన్ని సీపీఐ(ఎం) ఆక్షేపించింది. తక్షణమే తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఉసిరికాయలపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా వైభవంగా...

జ్ఞానేశ్ కుమార్ పై మోదీకి అంత ప్రేమ ఎందుకు?

- సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం సింగరేణి : అక్టోబర్, 14: దేశ ప్రజలు ముక్తకంఠంతో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విద్యార్థులు యువజనలు ప్రజలు రోడ్లమీద కొచ్చి దేశ రాజధాని ఢిల్లీ లో పోరాడుతుంటే ప్రజలపై దేశం కని విని ఎరుగని రీతిలో నిర్బంధం ప్రయోగించడం వెనుక జ్ఞానేశ్ కుమార్ పై మోదీకి అంత ప్రేమ ఎందుకు అని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం ప్రశ్నించారు. స్థానిక భాగం రామ నరసయ్య భవనంలో సిపిఎం సింగరేణి మండల...

తీరొక్క పూలతో అలంకరించి ఆరాధించే పండుగ బతుకమ్మ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఉత్సాహభరితంగా కలెక్టరేట్ లో అట్ల బతుకమ్మ వేడుకలు కలెక్టరేట్ లో వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలలో పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్‌ -14: తీరొక్క పూలతో అలంకరించి పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ మన బతుకమ్మ అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఐదవ రోజు అట్ల బతుకమ్మ సందర్భంగా కలెక్టరేట్ లోని వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో...

అభిషేక్‌ శర్మ రికార్డు బద్దలు.. పాక్‌ కెప్టెన్‌ ఫర్హాన్‌ ప్రపంచ రికార్డు!

ఆర్యాద్వి న్యూస్‌ | స్పోర్ట్స్‌ పాకిస్థాన్‌ టీ20 కెప్టెన్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తం 238 పరుగులు చేసి, ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ నెలకొల్పిన 229 పరుగుల రికార్డును అధిగమించాడు. ఐసీసీ అక్టోబర్‌ 14న ఈ విషయాన్ని వెల్లడించింది. వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఫర్హాన్‌ వరుసగా 89, 73, 76...

జనసేనలోకి వంగవీటి రాధా.. మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా?

పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరిక.. విజయవాడలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ ఆర్యాద్వి న్యూస్‌ | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. బుధవారం (అక్టోబర్‌ 14) అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా రాధాకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి...

ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నూతనకల్, ఆర్యాద్వి న్యూస్‌: ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని బక్క హేమ్లాతండా గ్రామ సర్పంచ్‌ గుగులోత్‌ కృష్ణ నాయక్‌, ఉప సర్పంచ్‌ నేనావత్‌ సురేందర్‌ నాయక్‌, గ్రామ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు కేతావత్‌ మంగత్య నాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు గుగులోత్‌ సురేందర్‌ నాయక్‌ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం సూర్యాపేట జిల్లా...

వైభవ్‌కు వరుసగా అవకాశాలివ్వాలి.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై శ్రీకాంత్‌ అసహనం!

ఆర్యాద్వి న్యూస్‌ | స్పోర్ట్స్‌ భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి జట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్‌, 1983 ప్రపంచకప్‌ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లను పదేపదే మార్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం కల్పించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సూచించారు. జింబాబ్వేలో అదరగొట్టిన వైభవ్‌ జింబాబ్వే పర్యటనలో వైభవ్‌ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు టీ20 మ్యాచ్‌ల్లో వరుసగా 50, 20, 81 పరుగులు...

ఐపీఎల్‌ 2027కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక ట్రేడ్‌.. నట్టూ మళ్లీ హైదరాబాద్‌కు!

ఆర్యాద్వి న్యూస్‌ | స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక ఆటగాళ్ల మార్పిడి ఒప్పందాన్ని పూర్తి చేసింది. భారత ఎడమచేతి పేసర్‌ టీ. నటరాజన్‌ మళ్లీ హైదరాబాద్‌ జట్టులోకి చేరగా, యువ లెగ్‌ స్పిన్నర్‌ జీషన్‌ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ అధికారికంగా అక్టోబర్‌ 14న ప్రకటించింది. రూ.5 కోట్లకు నటరాజన్‌ రీఎంట్రీ నటరాజన్‌ 2020 నుంచి 2024 వరకు ఐదు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా 2024 సీజన్‌లో 19...

అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాలు: పోలీస్ కమిషనర్

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్: 14: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు దేశ శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల విధులు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల రక్షణలో పోలీసుల...

జనసేనలోకి వంగవీటి రాధా.. విజయవాడ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ!

విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అక్టోబర్‌ 14న పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మేయర్‌ రేసులో రాధా పేరు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి రిజర్వేషన్‌ జనరల్‌ కేటగిరీగా ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఆయన...

కాంటాక్ట్ లెన్స్ వాడేవారు జాగ్రత్త.. నీటితో శుభ్రం చేస్తే కంటికి ముప్పు!

కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించేవారు వాటి శుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లెన్స్‌లను కుళాయి నీరు, మినరల్ వాటర్ లేదా ఇతర నీటితో కడగడం ప్రమాదకరం. నీటిలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు కళ్లలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమై, ఒక్కోసారి చూపుపైనా ప్రభావం చూపవచ్చు. అకాంతమీబాతో ఇన్ఫెక్షన్‌ ప్రమాదం నీటిలో కనిపించే అకాంతమీబా అనే సూక్ష్మజీవి కాంటాక్ట్ లెన్స్‌ల ద్వారా కంటిలోకి చేరితే అరుదైనప్పటికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ అయిన అకాంతమీబా కెరటైటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య వల్ల కంటిలో నొప్పి, ఎర్రబడటం, వెలుతురు చూడలేకపోవడం,...