EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ల్యాండ్_చీటింగ్ కేసులో నిందితుడినీ అరెస్టు చేసిన చివ్వెంల పోలీసులు., రిమాండ్‌కు తరలింపు.

    ల్యాండ్_చీటింగ్ కేసులో నిందితుడినీ  అరెస్టు చేసిన చివ్వెంల పోలీసులు., రిమాండ్‌కు తరలింపు.

    వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిందితుడు.

    🫵లేని భూమిని ఉన్నట్లుగా, ఇతరులకు చెందిన భూమి తనదిగా చూపి అమాయక ప్రజలకు అమ్ముతూ డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడుతున్న నిందితుడు.

    🫵చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులు పెడితే చట్టప్రకారం చర్యలు తప్పవు... సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్.

    👉సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయం నందు మీడియాకు వివరాలు వెల్లడించిన సిఐ.

    ఇవి కూడా చదవండి

    అయిలాపురం గ్రామ శివారులో ఉన్న భూమిని ప్లాట్లుగా విక్రయిస్తానని చెప్పి,ఇతరుల భూమిని తనదిగా నమ్మబలికి కోడదల వెంకన్న, కోడదల కనకయ్యల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన కాసర్ల సురేందర్ రెడ్డి, అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితుడు కోడదల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది దీని దర్యాప్తు చేసి నిందితున్ని రిమాండ్ కు తరలించడం జరిగినది అని సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్ తెలిపినారు.

    వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిందితుడు,లేని భూమిని ఉన్నట్లుగా, ఇతరులకు చెందిన భూమి తనదిగా చూపి అమాయక ప్రజలకు అమ్ముతూ డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించాం అన్నారు.

    కేసు దర్యాప్తును చివ్వెంల ఎస్‌ఐ మహేశ్వర్ చేపట్టగా, విచారణలో సంబంధిత భూమి కాసర్ల సురేందర్ రెడ్డికి చెందినది కాదని, ఇతరుల భూమిని తనదిగా చూపించి బాధితులను మరియు ఇతరులను కూడా మోసం చేసినట్లు తెల్సింది.

    భాదితులు ఎవరైనా ఉంటే పోలీస్ల ను ఆశ్రయించగలరు దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు నిందితుడు కాసర్ల సురేందర్ రెడ్డి ను ఈ రోజు సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. రాజశేఖర్ అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.
    భూముల కొనుగోలు, విక్రయాల సందర్భంగా సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, యాజమాన్య హక్కులను రెవెన్యూ అధికారుల ద్వారా ధృవీకరించుకున్న అనంతరమే లావాదేవీలు నిర్వహించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.