EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంలో వైద్య బృందాలు ముందుండాలి:జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

         సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంలో వైద్య బృందాలు ముందుండాలి:జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

    సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంలో వైద్య బృందాలు ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటివి వస్తే తక్షణ చికిత్స అందించేందుకు మలేరియా, ఫీవర్ బృందాలు చురుకుగా పని చేయాలని చెప్పారు .
    రానున్న 2,3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ అధిక వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్ర విపత్తు నిర్వహణ సెక్రెటరీ తో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వాతావరణ పరిస్థితిలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
    అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వాతావరణ పరిస్థితులను సమీక్షిస్తూ జిల్లాలో ఒకవేళ అధిక వర్షాలు నమోదైనట్లైతే ఎక్కడా రహదారి వ్యవస్థ దెబ్బతినకుండా ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జ్వరం, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో మందుల అందుబాటు, చికిత్సలకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో సమీక్షించారు. మలేరియా ప్రాజెక్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో తిరగాలని, ప్రత్యేకించి మున్సిపాలిటీలపై దృష్టి సారించి ప్రతి మంగళ, బుధ, గురువారాలు మున్సిపాలిటీలలో పర్యటించాలని ,శుక్ర, శనివారాలు గ్రామపంచాయతీలలో పర్యటించాలని ఆదేశించారు. ఎక్కడైనా మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు సోకితే తక్షణమే చికిత్స ప్రారంభించాలని చెప్పారు.
    ఈ టెలికాన్ఫెరెన్స్ కు జిల్లా రెవిన్యూ అధికారి దశరథ్ ,రోడ్లు, భవనాల శాఖ ఎస్ ఈ పున్న మోహన్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీధర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రాహుల్ ,జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా మలేరియా అధికారి, తదితరులు హాజరయ్యారు.