EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రూ.3.25 లక్షల నగదు, స్కూటీ, చోరీ పరికరాలు స్వాధీనం – మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక గాలింపు -అడిషనల్ ఎస్పి జి.రమేష్

     రూ.3.25 లక్షల నగదు, స్కూటీ, చోరీ పరికరాలు స్వాధీనం – మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక గాలింపు   -అడిషనల్ ఎస్పి జి.రమేష్

    పగటి పూట తాళం వేసి ఉన్న ఇండ్లను, అపార్ట్ మెంట్‌లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన నల్లగొండ సబ్ డివిజన్ పోలీసులు

    నల్లగొండ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస పగటి పూట చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన నల్లగొండ I టౌన్, II టౌన్ పోలీసుల సమన్వయంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఒక ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి కేసును ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, ఒక స్కూటీ, చోరీలకు ఉపయోగించిన ఇనుప రాడ్లు, మాస్క్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

    కేసు నమోదు :
    తేధి 26-07-2026న నల్లగొండ పట్టణంలోని వి.టి. కాలనీలో గల అపార్ట్ మెంట్‌లోని ఓ ఫ్లాట్ తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు అపహరించబడిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు Crime No.286/2026, U/S 331(3), 305(a) BNS కింద నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

    అరెస్టు వివరాలు :
    దర్యాప్తులో భాగంగా 06-08-2026 సాయంత్రం సుమారు 5.00 గంటలకు నల్లగొండలో మరోసారి చోరీలకు పాల్పడేందుకు స్కూటీపై వస్తున్న ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్ (48), తండ్రి రహీముద్దీన్, హోటల్ వర్కర్, స్వస్థలం సుభాష్ విహార్, భజన్‌పురా, నార్త్ ఈస్ట్ ఢిల్లీను పానగల్ బైపాస్ రోడ్డువద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నల్లగొండ వన్ టౌన్, నల్లగొండ II టౌన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం, తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి వివిధ చోరీ కేసులకు సంబంధించిన రూ.3,25,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    ఇవి కూడా చదవండి

    నేరం చేసిన విధానం (Modus Operandi)
    విచారణలో ఈ ముఠా అత్యంత తెలివిగా చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.ముందుగా తాళం వేసి యజమానులు లేని ఇళ్లను గుర్తించి, అక్కడ కొంతసేపు రెక్కీ నిర్వహించేవారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం పగటి సమయంలో అపార్ట్ మెంట్లు, ఇండ్ల తాళాలను ఇనుప రాడ్లతో పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని వెంటనే అక్కడి నుంచి పరారయ్యేవారు.

    నల్లగొండలో జరిగిన సంఘటనలో తేదీ 26-07-2026న ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్, అతని సహచరుడు ఇర్షాద్ స్కూటీపై నల్లగొండకు రాగా, మరో నిందితుడు షరీఫ్ కారులో వచ్చి బయట కాపలా కాశాడు.
    ఈ ముగ్గురు కలిసి నల్లగొండ ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో తాళాలు పగలగొట్టి (5) తులాల బంగారు నగలు, నగధు రూపాయలు 30,000/- మరియు నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వి.టి. కాలనీలోని అపార్ట్ మెంట్‌లో ఫ్లాట్ తాళం పగులగొట్టి (3) తులాల బంగారు ఆభరణాలు మరియు నగధు అపహరించిన ఘటన కూడా ఇదే ముఠా చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం లో ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి (24) తులాల బంగారు ఆభరణాలు, (03) కిలోల వెండి ఆభరణాలు మరియు తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి (9) తులాల బంగారు ఆభరణాలు, (15) తులాల వెండి ఆభరణాలు నమోదైన పలు చోరీ కేసుల్లో కూడా ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    నేరచరిత్ర :
    ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్ పాత నేరస్థుడు. తన సహచరులు ఇర్షాద్, షరీఫ్లతో కలిసి గతంలో ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతాల్లో అనేక చోరీలకు పాల్పడి అరెస్టై జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు.
    తరువాత ఢిల్లీలో పోలీసుల నిఘా పెరగడంతో హైదరాబాద్‌కు వచ్చి రాయదుర్గం, ఉప్పల్, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. ఆ కేసుల్లో అరెస్టై సుమారు రెండు సంవత్సరాలు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన అనంతరం విడుదలై, మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అద్దె ఇంటిని తీసుకుని అక్కడే నివసిస్తూ తిరిగి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

    స్వాధీనం చేసుకున్న ఆస్తి:
    * నగదు – రూ.3,25,000/-
    * స్కూటీ – DL-5S-DS-1374
    * రెండు ఇనుప రాడ్లు
    * ఒక ముఖానికి ధరించే మాస్క్
    * ఒక సెల్‌ఫోన్
    పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు :
    ఈ కేసులో పరారీలో ఉన్న ఇర్షాద్, షరీఫ్ ల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రాష్ట్రాల మధ్య సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.

    ఈ కేసును నల్గొండ DSP శ్రీ K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ వన్ టౌన్ సీఐ శ్రీ A.రాజశేఖర్ రెడ్డి, నల్లగొండ టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K.ఆది రెడ్డి, ఆధ్వర్యంలో సమర్థవంతంగా దర్యాప్తు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రూ.3.25 లక్షల నగదు రికవరీ చేయడంతో పాటు కేసును ఛేదించిన వన్ టౌన్ సీఐ శ్రీ A.రాజశేఖర్ రెడ్డి, SI శ్రీ డి.సైదబాబు, SI శ్రీ ముత్తయ్య, శ్రీ G.మానస మరియు పోలీసు సిబ్బంది రబ్బాని, శంకర్, అంజద్, లావూరి బాలకోటి,మహమ్మద్ షకీల్, జానకి రాములు, హోం గార్డ్ శ్రీను లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, IPS ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.