EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ, వరమైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*

    బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ, వరమైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*

    *బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ, వరమైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*

    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మన్సురాబాద్‌లోని శ్రీ మైసమ్మ దేవాలయం, కొత్తపేట మోహన్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లోని శ్రీ వరమైసమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ, వరమైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త* - Additional Image

    ముందుగా మన్సురాబాద్‌లోని శ్రీ మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనం సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపేట మోహన్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో శ్రీ వరమైసమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలవడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదని తెలిపారు.

    బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ, వరమైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త* - Additional Image

    అమ్మవార్ల చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

    ప్రజలందరూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు కోరారు.

    ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, దుర్గయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డబుల్ బెడ్‌రూం కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.