EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయాలి: మధుయాష్కి గౌడ్

    Author SHANKARAVAM NEWS | 22 Aug 2026, 07:39 PM | NATIONAL, Politics, TELANGANA
    కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయాలి: మధుయాష్కి గౌడ్

    కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయాలి: మధుయాష్కి గౌడ్
    సంఘటన్ సృజన అభియాన్ లో భాగంగా రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం
    హాజరైన ఏఐసిసి పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్సీ మోహన్, ఎమ్మెల్యే మట్టా రాగమయి, పటేల్ రమేష్ రెడ్డి తదితరులు

    రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని.. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతగా ఉండడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నిక కోసం జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఈరోజు మందమల్లమ్మ చౌరస్తాలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
    ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ సీవీ మోహన్ గారు ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. కోఆర్డినేటర్స్ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధుయాష్కి గారు మాట్లాడుతూ... ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా జరిగేలా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సామాజిక న్యాయం ఎజెండాగా రాహుల్ గాంధీ గారు ముందుకు వెళ్తున్న తరుణంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కూడా సామాజిక సమీకరణాలను పరిగణలో తీసుకొని పారదర్శకంగా నూతన డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు ఎంతో సమర్థవంతంగా పనిచేశారని, వారి సేవలను అభినందించారు.
    అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన తనకు రాష్ట్ర ఏర్పాటుతో జీవితాంతం ఆ సంతృప్తి ఉంటుందని.. పదవిలో ఉన్నామా లేమా అనే విషయాలను పట్టించుకోకుండా పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ లో భాగంగా ఓటర్ లిస్టులు వచ్చినందున అందరి ఓట్లు ఉన్నాయా లేవా అందరూ సరి చూసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మోహన్ గారు, మట్టా రాఘవయ్య గారు పటేల్ రమేష్ రెడ్డి గారు తదితరులు మాట్లాడారు.

    కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయాలి: మధుయాష్కి గౌడ్ - Additional Image