EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్

    లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్

    లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్
    హైదరాబాద్: లంచం తీసుకుంటూ చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ బండెల బాల్‌రాజ్, పీసీ-7491 బి. రాఘవేంద్రపై లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.
    క్రైం నంబర్ 696/2026 కేసు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.75 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ క్రమంలో శనివారం (ఆగస్టు 22) రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎస్‌ఐ బండెల బాల్‌రాజ్, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర పట్టుబడ్డారు.
    ఏసీబీ ప్రకారం.. ఎస్‌ఐ ఇప్పటికే రూ.20 వేల నగదు, కానిస్టేబుల్ రూ.10 వేల మొత్తాన్ని యూపీఐ ద్వారా స్వీకరించారు. అనంతరం రూ.75 వేల లంచం మొత్తాన్ని ఎస్‌ఐ కార్యాలయంలోని టేబుల్ డ్రాలో ఉంచినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
    ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు సక్రమంగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
    లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.