Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Author
Posted By ARYADVI NEWS
| 09 Oct 2026, 07:06 PM | TELANGANA
ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కోదాడ అక్టోబర్ 9, (ఆర్యాద్వి): జోనల్ ఇన్చార్జి స్నేహలత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్నేహలత మాట్లాడుతూ బతుకమ్మ అంటే పూల జాతర అని అన్నారు. ప్రపంచంలోనే పువ్వులను దేవతగా కొలిచే సంప్రదాయం తెలంగాణకి పరిమితం అన్నారు. ఆడపడుచులు తమ కష్టసుఖాలను పాటల రూపంలో తెలియజేస్తూ ఆటపాటలతో జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. ప్రతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. పండగ అంటే అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవడమే అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు  - Additional Image