Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ప్రేమ ఓడిపోయింది.. పైసా గెలిచింది: 69 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన యువతి!

Author
Posted By ARYADVI NEWS
| 25 Aug 2026, 06:09 AM | ఆధ్యాత్మికత
ప్రేమ ఓడిపోయింది.. పైసా గెలిచింది: 69 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన యువతి!

ప్రేమించిన ప్రియుడిని కాదని, కోట్ల ఆస్తి ఉన్న 69 ఏళ్ల వృద్ధుడిని ఓ యువతి వివాహం చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కథనం ప్రకారం.. ఓ యువతి, యువకుడు కలిసి చదువుకుంటూ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ద్వారా 69 ఏళ్ల అవివాహితుడితో యువతికి పరిచయం ఏర్పడింది. ఆయనకు ఉన్న విలాసవంతమైన బంగ్లాలు, ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల ఆస్తికి ఆకర్షితురాలైన యువతి.. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.వయసులో భారీ వ్యత్యాసం ఉండటంతో కుటుంబ సభ్యులు తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరకు పెళ్లికి అంగీకరించారు.
పెళ్లి మండపానికి ప్రియుడి ఎంట్రీ..
వివాహం జరుగుతున్న సమయంలో నాలుగేళ్లుగా ప్రేమించిన యువకుడు కల్యాణ మండపానికి వచ్చి యువతిని ప్రశ్నించినట్లు కథనం. అయితే యువతి.. తనకు డబ్బు, విలాసవంతమైన జీవితం కావాలని, పేదరికంలో జీవించడం ఇష్టం లేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజమైన ప్రేమ కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడం సరైన నిర్ణయమా? లేక ఇది స్వార్థపూరిత ఆలోచనా? అంటూ చర్చించుకుంటున్నారు.