Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పల్నాడులో ఘోర ప్రమాదం.. బస్సు ఢీకొని ఏడుగురు మృతి

Author
Posted By ARYADVI NEWS
| 27 Aug 2026, 08:19 AM | ANDHRA PRADESH
పల్నాడులో ఘోర ప్రమాదం.. బస్సు ఢీకొని ఏడుగురు మృతి

పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిలకలూరిపేట–అద్దంకి మార్గంలోని అద్దంకి సెంటర్‌ వద్ద వేగంగా వచ్చిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదంలో మరో పది మంది గాయపడగా.. వారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

మృతులంతా చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఘటనతో వేలూరు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.