హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లోని కుమురం భీం ఆదివాసీ భవన్లో శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గ గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు.
తాను కార్యక్రమానికి వచ్చేలోపే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించారని దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు. “ఎమ్మెల్యే అంటే భయం లేదా?” అంటూ అధికారులపై మండిపడ్డారు. ప్రొటోకాల్ను పాటించకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునేలా చూస్తానని దానం నాగేందర్ హెచ్చరించారు.


