తుంగతుర్తి: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సీలింగ్ భూముల సమస్యకు పరిష్కారం లభించిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సుమారు 70 ఏళ్లుగా హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భూములపై చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పలువురు రైతుల దీర్ఘకాలిక నిరీక్షణకు తెరపడిందన్నారు. సీలింగ్ భూములకు పట్టాలు అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు.
ఈ సమస్య పరిష్కారంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రత్యేక చొరవ చూపారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రైతుల తరఫున సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పట్టాల పంపిణీకి కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
అలాగే ఈ ప్రక్రియలో సహకరించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
సీలింగ్ భూముల పట్టాల పంపిణీతో రైతుల భూ హక్కులు మరింత బలోపేతం అవుతాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


