హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయం నిజమేనని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా ఆ హామీ అమలు ఆలస్యమైందని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్నపాటి సమస్యలు, నేతల మధ్య అసంతృప్తులు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై కూడా ఆయన స్పందించారు. సెప్టెంబర్లో వీటికి పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సెప్టెంబర్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశంపై రాజకీయ చర్చ మొదలైంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.


