హైదరాబాద్: తెలంగాణలో రుతుపవనాలు మరోసారి చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్లోనూ వర్షం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


