Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రెండు రోజుల పాటు పులివెందులలో జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రికి నివాళి

Author
Posted By ARYADVI NEWS
| 31 Aug 2026, 06:08 PM | ANDHRA PRADESH
రెండు రోజుల పాటు పులివెందులలో జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రికి నివాళి

పులివెందుల: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నియోజకవర్గానికి రానున్నారు.

సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పులివెందులకు చేరుకునే జగన్.. భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.

సెప్టెంబర్ 2న ఉదయం పులివెందుల నుంచి ఇడుపులపాయకు బయలుదేరి 7.45 గంటలకు అక్కడికి చేరుకుంటారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.

ఇవి కూడా చదవండి

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా ఏటా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి జగన్ నివాళులర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.