ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఉపయోగపడేలా ఫోన్‌పే కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ‘UPI 123Pay’ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే యూపీఐ లావాదేవీలు నిర్వహించే అవకాశం కల్పిస్తోంది.
నోకియా, హెచ్ఎండీ, లావా, ఐటెల్ వంటి మొబైల్ తయారీ సంస్థలతో ఫోన్‌పే భాగస్వామ్యం చేసుకుంది. దీంతో ఆయా సంస్థలు విడుదల చేసే కొత్త ఫీచర్ ఫోన్లలో ఈ సేవ ముందుగానే అందుబాటులో ఉండనుంది.
బ్యాంకు ఖాతాను ఎంచుకున్న తర్వాత డెబిట్ కార్డు వివరాలతో యూపీఐ పిన్ను సెట్ చేసుకోవచ్చు. చెల్లింపులతో పాటు బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ తెలుసుకోవడం, గత లావాదేవీలను పరిశీలించడం వంటి సదుపాయాలు కూడా ఈ సేవలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఇంగ్లిష్తో పాటు 12 భారతీయ భాషల్లో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం పరిమితంగా ఉన్న గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ సేవను తీసుకొచ్చినట్లు ఫోన్‌పే తెలిపింది.


