Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఏపీలో వెలిగొండకు కృష్ణా జలాల తరలింపు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

Author
Posted By ARYADVI NEWS
| 31 Aug 2026, 06:17 PM | TELANGANA
ఏపీలో వెలిగొండకు కృష్ణా జలాల తరలింపు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తెలంగాణలో భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే.. ఏపీకి నీటిని తరలించడంపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఎలాంటి కేటాయింపులు లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీటిని తరలించడం తెలంగాణ రైతుల హక్కులపై దాడి చేయడమేనని మండిపడ్డారు.

మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు తర్వాత ఇప్పుడు వెలిగొండ ద్వారా కూడా తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాల ఆయకట్టుకు నీరందించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

కృష్ణా జలాల వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఆక్షేపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని KRMBపై ఒత్తిడి తీసుకురావాలని, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.