పతకాలు సాధించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం ప్రతినిధి : ఆగస్టు, 31:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి.
ఇవి కూడా చదవండి
ఉత్తమ సేవ పతకాలు సాధించిన ముగ్గురిలో అడిషనల్ డీసీపీ బి.రామానుజం, హెడ్ కానిస్టేబుళ్లు వి.బిక్షపతి, కె సూర్యప్రకాష్ రెడ్డి వున్నారు.
వారితో పాటు సేవ పతకాలు సాధించిన (12) మందికి సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా 15 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసి అభినందించారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.


